ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వరంగల్ ఏ.ఎస్పీగా శుభం ప్రకాష్ నియామకం

వరంగల్ ఏ.ఎస్పీగా శుభం ప్రకాష్ నియామకం

వరంగల్, ఆధాబ్ న్యూస్:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ డివిజన్‌కు కొత్త ఏ.ఎస్పీగా ఐపీఎస్ అధికారి ఎన్. శుభం ప్రకాష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2022 బ్యాచ్‌కు చెందిన శుభం ప్రకాష్ 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ట్రైనీ ఐపీఎస్‌గా ఆరు నెలల పాటు సేవలందించారు. అప్పటి నుండి ఆయన ప్రాధమిక స్థాయిలో జిల్లా పరిస్థితులు, ప్రజల సమస్యలు, భద్రతా వ్యవస్థపై సమగ్రమైన అవగాహనను పెంచుకున్నారు.

ఇక వరంగల్ డివిజన్ ఏ.ఎస్పీగా ఆయన నియామకం నేపథ్యంలో ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న నందిరాం నాయక్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. జిల్లా పోలీసు పరిపాలనలో ఈ మార్పులు కీలకంగా భావించబడుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!