కంది విజయలక్ష్మికి మంత్రి సీతక్క నివాళి
ములుగు,ఆధాబ్ న్యూస్:
ములుగు మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ కంది మహేశ్వర్ రెడ్డి తల్లి కంది విజయలక్ష్మి అకాలమరణం చెందారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క జగ్గన్నపేటను సందర్శించి, కంది విజయలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం వ్యక్తం చేశారు.
అదే గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య ఇటీవల మరణించగా, ఆయన కుటుంబాన్నీ పరామర్శించి, ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 23









