కరకగూడెం మండలంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం
ఆదివాసీ యువతకు వాలీబాల్ కిట్లు, కుటుంబాలకు దోమతెరల పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు వలస ఆదివాసీ గ్రామం, గుత్తికోయ గ్రామం మరియు అనంతారం గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో జరిగింది.
యువతకు వాలీబాల్ కిట్లు, కుటుంబాలకు దోమతెరలు (ఎన్జీవో సహకారంతో) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించకూడదని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి తోడుగా నిలిచి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు.
మావోయిస్టుల సిద్ధాంతాలు కాలం చెల్లిపోయినవని పేర్కొంటూ, యువత విద్య ద్వారా ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల కేసులు, జైలు శిక్షలు అనివార్యం కావచ్చని హెచ్చరించారు.
కార్యక్రమంలో స్పెషల్ పార్టీ TGSP సిబ్బంది పాల్గొన్నారు.









