ఏసీబీకి చిక్కిన ఎస్సై రాంచందర్
కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌లో మెరుపుదాడులు – లంచం తీసుకుంటూ రెండవ ఎస్సై రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
నాగర్ కర్నూల్, ఆధాబ్ న్యూస్:
నాగర్‌కర్నూల్ కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌లో రెండవ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాంచందర్ ఏసీబీకి చిక్కిన సంఘటన కలకలం రేపుతోంది. గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య భూమి వివాదం కేసును రాజీ చేయడానికిగా ఎస్సై రాంచందర్ రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా బాధితుడి నుంచి మొదట విడతగా రూ.10,000 తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచం ఘటనపై బాధితుడు ముందుగా ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు పక్కా ప్లాన్‌తో ట్రాప్ వేయగా ఎస్సై రాంచందర్ పట్టుబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే ప్రజలు నిర్భయంగా ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Post Views: 46









