కరకగూడెంలో డ్రగ్స్ వ్యతిరేక బైక్ ర్యాలీ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం
యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ (జూన్ 25) సందర్భంగా, ఎస్సై పి. వి. ఎన్. రావు ఆధ్వర్యంలో అనంతారం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది యువకులు తమ బైకులతో చురుకుగా పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న యువతకు డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే హానీలు, చట్టపరమైన పరిణామాలు వివరించబడ్డాయి. మత్తు పదార్థాల వాడకం, అమ్మకం, సరఫరా వంటి చర్యలను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పి. వి. ఎన్. రావు ప్రజలను కోరారు.
“మత్తు పదార్థాలు జీవితాలను నశింపజేస్తున్నాయి కేవలం వ్యక్తులను మాత్రమే కాదు, సమాజం మొత్తాన్నీ. అందుకే ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా నిలవాలి” అని ఆయన అన్నారు.
ర్యాలీ ముగింపులో యువతకు అవగాహన పెంచే విధంగా బ్రోచర్లు పంపిణీ చేయబడినాయి.









