ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సండే బ్రిక్స్ ఓపెన్ చాలెంజ్” కు ప్రజల నుంచి ఆహ్వానం – కొత్తగూడెంలో మట్టి ఇటుకలతో వినూత్న కార్యక్రమం. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

“సండే బ్రిక్స్ ఓపెన్ చాలెంజ్” కు ప్రజల నుంచి ఆహ్వానం – కొత్తగూడెంలో మట్టి ఇటుకలతో వినూత్న కార్యక్రమం. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ 19: పర్యావరణ హితంగా మట్టి ఇటుకలు తయారు చేయాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం “సండే బ్రిక్స్ ఓపెన్ చాలెంజ్” అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ 22, 2025 (ఆదివారం) ఉదయం 6:00 గంటల నుంచి 9:00 గంటల వరకు ప్రగతి మైదానం, కొత్తగూడెంలో ఈ ఓపెన్ చాలెంజ్ నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ
ఇది కేవలం పోటీ కాదు, ప్రజల్లో శ్రమ పట్ల గౌరవాన్ని, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను పెంపొందించే ఒక అనుభవాత్మక కార్యక్రమం” అని పేర్కొన్నారు.

 

ఈ చాలెంజ్ లో పాల్గొనే వారు మట్టి తో ఇటుకలు తయారు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఇటుకలు తయారు చేసిన వ్యక్తిని ‘బ్రిక్స్ ఛాంపియన్’గా ప్రకటించి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రత్యేక టీ-షర్ట్ బహుమతి అందజేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని బెంగళూరుకు చెందిన CSEB నిపుణులు సుధాకర్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. యువత, వాకర్లు, విద్యార్థులు, పౌరులు ఉదయం 7 గంటల లోపు హాజరై చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఓపెన్ చాలెంజ్ అనంతరం ఉద్యోగులు మరియు అధికారుల కోసం ప్రత్యేకంగా మట్టి ఇటుకల తయారీపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగుతుంది.

కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమం ద్వారా:

పర్యావరణ పరిరక్షణ

ఆరోగ్యకరమైన జీవనశైలి

స్థానిక వనరుల వినియోగం

శ్రమకు గౌరవం

సామాజిక ఐక్యత
వంటి అంశాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!