ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

సంగారెడ్డి ,ఆధాబ్ న్యూస్:
సంగారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ ఒక పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. మునిపల్లి మండలం, బుధేరా గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పట్లోళ్ల నాగలక్ష్మి అనే కార్యదర్శి, ఓ పౌరుడి నుండి రూ. 8,000/- లంచం తీసుకుంటుండగా (ACB) అధికారులు పట్టుకున్నారు.

లంచం డిమాండ్ చేసిన కారణాలు:

ఫిర్యాదుదారు స్థలంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం.

ఫిర్యాదుదారు ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్ కేటాయించడం.

ఈ మేరకు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి పట్లోళ్ల నాగలక్ష్మిని లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల నుండి లంచం వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. అయితే ఇటువంటి దాడుల ద్వారా ప్రభుత్వ శాఖలలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!