కరకుగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు జిమ్మీడి నవీన్ ఇంటి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమ జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ—
ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం.” “పేద ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం.”తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోంది” అని వివరించాడు.
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కునుసోత్ సాగర్, మండల నాయకులు గాంధర్ల రామనాథం, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.









