టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా సరిత
హైద్రాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత సేవల్ని ప్రారంభించారు.
సరిత తన తొలి విధిలో భాగంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపారు. గతంలో ఢిల్లీలో డ్రైవర్‌గా పనిచేసిన అనుభవాన్ని ఆమె కలిగి ఉన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు కూడా డ్రైవింగ్ వంటి విభాగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ ఘట్టం టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఒక మైలురాయి గానే రాష్ట్ర మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచింది.
Post Views: 53









