ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం మండల నాయకులు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం మండల నాయకులు.

భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 64వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం నియోజకవర్గంలోని మండల నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదినోత్సవాన్ని జరిపారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు అరికెల తిరుపతిరావు, పెద్దినేని శ్రీనివాస్, భీమవరపు వెంకటరెడ్డి, అన్నెం సత్యనారాయణ మూర్తి, చేగొండి శ్రీనివాస్, పడిసిరి శ్రీనివాస్, ధర్మారావు, యేసు రత్నం, ఓగ్గె రమణ, యూత్ కాంగ్రెస్ నాయకులు గాడి విజయ్, గాడి రాజేష్, మైధిలి బి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క ప్రజాసేవలో అందిస్తున్న విశేష పాత్రను గుర్తుచేసుకుంటూ, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో కొనసాగాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!